జర్నలిస్టులకు ఎన్నో చెప్పుకోలేని కష్టాలు | cm kcr starts janahitha scheme | Sakshi
Sakshi News home page

Feb 17 2017 4:13 PM | Updated on Mar 20 2024 1:58 PM

భారత్‌లో ఏ రాష్ట్రం లేనంత గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బంగారు తెలంగాణ మరెక్కడో లేదని, గ్రామీణ వ్యవస్థ పటిష్టమవడంలోనే ఉందని తెలిపారు. శుక్రవారం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా జనహితం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయంగా రూ.4లక్షల చెక్కులందించారు. జర్నలిస్టులను ఆదుకునేందుకు ఎప్పటికీ ముందుంటామని, పేద జర్నలిస్టులకు సాయం చేసే బాధ్యత తమదేనని తెలిపారు. జర్నలిస్టుల కోసం పనిచేసే ప్రెస్‌ అకాడమికి గత బడ్జెట్‌లో రూ.20 కోట్లు ఇచ్చామని, ఈసారి దానిని రూ.30 కోట్లకు పెంచుతామని, రానున్న రోజుల్లో రూ.50 కోట్లకు పెంచుతామని చెప్పారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement