తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం కుటుంబ సమేతమంగా వేములవాడ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు దేవస్థానం చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ ఈఓ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేసిన కేసీఆర్ దేవాలయంలో లక్ష్మీ గణపతి పూజ, రుద్రాభిషేకం, శ్రీమాత పూజ, రాజేశ్వరీ అమ్మవారి పూజ నిర్వహించారు.