ఎంసెట్-2 పేపర్ లీక్పై సీఐడీ విచారణ వేగవంతం | Sakshi
Sakshi News home page

ఎంసెట్-2 పేపర్ లీక్పై సీఐడీ విచారణ వేగవంతం

Published Mon, Jul 25 2016 7:14 PM

తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ వేగవంతంగా విచారణ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలను సేకరించే పనిలో ఉంది. పేపర్ లీకైందనే కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. పేపర్ లీక్ ఘటనపై సీఐడీ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. సీఐడీ అధికారులు విజయవాడ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విచారణ చేశారు. బ్రోకర్తో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన కాల్ డేటాను సేకరించారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ.. ఎంసెట్ కన్వీనర్ రమణారావును పిలిపించి మాట్లాడారు.