దాసరిపై చార్జిషీటు | charge-sheet-on-dasari-narayana-rao | Sakshi
Sakshi News home page

Apr 30 2015 9:34 AM | Updated on Mar 22 2024 11:05 AM

అమరకొండ ముర్గదాంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావుపై సీబీఐ బుధవారం అభియోగాలు నమోదు చేసింది. వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సహా మొత్తం పది మందిపై, ఐదు సంస్థలపై చార్జిషీటు దాఖలైంది. జార్ఖండ్‌లోని బీర్భుమ్ జిల్లాలో ఉన్న అమరకొండ ముర్గదాంగల్ బొగ్గు బ్లాకును 2008లో దాసరి బొగ్గుశాఖ సహాయమంత్రిగా ఉండగా జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్‌పీఎల్, జీఎస్‌ఐపీఎల్‌లకు కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement