మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిగ్రీ చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కులాలు, మతాల పేరిట మనుషుల్ని వాడుకోవడం, ఏరు దాటాకా తెప్ప తగలేయడం చంద్రబాబు చేసిన డిగ్రీ అని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఆత్మకూరు జంక్షన్ వద్ద వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఎన్నికలు వస్తే చాలు. మనకళ్లకు గంతలు కడతారు. చంద్రబాబు ఏం చెప్పినా ఆహా, ఓహో అంటూ తన పేపర్లు, టీవీలు చెప్పేస్తాయి. తీరా ఏరు దాటాక ఆ విషయాలపై ఎవరైనా నిలదీసి అడిగితే చంద్రబాబు చిందులు తొక్కుతారు.