ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశించిందని, అందువల్ల కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు.