పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు మోక్షం లభించనుంది. దాదాపు రూ.100 కోట్ల బకాయిలను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం 2015లో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.