నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు

పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు నేటి నుంచి ఓ శుభవార్త. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నేటి నుంచి వారానికి రూ.50వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. జనవరి 30న జారీచేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రాలపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పిన ఆర్బీఐ, ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ వారానికి రూ.50వేలు డ్రా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఈ పరిమితి రూ.24వేలుగా ఉండేది. మార్చి 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నారు. ప్రస్తుతమైతే, కరెంట్ అకౌంట్ హోల్డర్స్కు నగదు విత్ డ్రాలపై ఎలాంటి పరిమితులు లేవు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top