భూ వివాదం: పోలీసు అధికారులపై కేసు | cases on police in land dispute | Sakshi
Sakshi News home page

భూ వివాదం: పోలీసు అధికారులపై కేసు

Aug 13 2017 6:34 PM | Updated on Mar 22 2024 11:03 AM

ఓ భూవివాదానికి సంబంధించి రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు చెందిన నలుగురు పోలీసు అధికారులపై కేసు నమోదైంది. సీఐ దుర్గాప్రసాద్‌, సైబరాబాద్‌ అదనపు డీసీపీ పులిందర్‌, ఎస్సై రాజశేఖర్‌, కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణపై పోలీసులు కేసు నమోదుచేశారు. రెండెకరాల భూమిని అగ్రిమెంట్‌ చేసుకొని నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంతో భూ యజమానులు ఆ భూమిని మరొకరికి అమ్మేశారు. ఈ సివిల్‌ వ్యవహారంలో తమపై అక్రమంగా కేసు నమోదుచేసి రాయదుర్గం పోలీసులు వేధించారని బాధిత భూ యజమానులు.. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ (సీపీ) సందీప్‌ శాండిల్యాను ఆశ్రయించారు. దీంతో నలుగురు పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ సీపీ శాండిల్యా ఏసీపీని ఆదేశించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement