వోల్వో బస్సుకు మంటలు.. చిన్నారి మృతి | bus burnt in karnataka, telugu kid dies | Sakshi
Sakshi News home page

Sep 16 2016 10:18 AM | Updated on Mar 21 2024 9:52 AM

కర్ణాటకలో ఘోరం జరిగింది. హుమ్నాబాద్ ప్రాంతంలో ఒక వోల్వో బస్సులో మంటలు చెలరేగి.. మూడేళ్ల చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారని ప్రమాదానికి సజీవ సాక్షి అయిన ప్రభాకరరెడ్డి 'సాక్షి'కి తెలిపారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ మంటలు వచ్చాయని అరుచుకుంటూ దిగి పారిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఈ బస్సు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హుమ్నాబాద్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కొంతమంది మాత్రం కిందకు దూకేశారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement