నోట్ల కష్టాలతో ప్రజల ఆక్రందనల్ని తమ గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఉక్కు పిడికిలితో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన చేసిన తమపై దౌర్జన్యాలు చేయిస్తోందని మండిపడ్డారు.