ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకైన వేడుకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హజ్ యాత్ర సందర్భంగా మక్కా జనంతో కిటకిటలాడుతోంది. పలు దేశాల నుంచి తరలివచ్చిన ముస్లింలతో రద్దీగా మారింది. సివిల్ వార్ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వందలాది సిరియన్లు కూడా ఈద్‌ను జరుపుకుంటున్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని మేకలు, గొర్రెలు, ఒంటెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఈ సందర్భంగా ఢిల్లీ జామా మసీదు పోటెత్తింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదుకు చేరుకుంటున్నారు. సామూహికంగా నమాజులు పఠిస్తున్నారు. హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా, మక్కా మసీద్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Oct 16 2013 10:18 AM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement