ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'బాహుబలి' సినిమా అభిమానుల ముందుకు వచ్చేసింది. తిరుపతిలో ఫ్యాన్స్ షో కోసం గత రాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానులు పెద్దఎత్తున బారులు తీరారు. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. గ్రూప్ థియేటర్స్ వద్ద అభిమానులపై పోలీసులు లాఠీలు కూడా ఝుళిపించారు. లాఠీ దెబ్బలు తగులుతున్నా... సినిమా చూసేవరకు అభిమానులు థియేటర్లను వదల్లేదు.