‘ఓటుకు నోటు’ వ్యవహారంలో పీకల్లోతున కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడి (కౌంటర్ ఎటాక్)కి దిగాలని యోచిస్తున్నారు. వీలున్నంత వరకు తెలంగాణ సర్కారు, నేతలను ఇబ్బందులకు గురిచేయాలని వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నుంచి తనకు నోటీసులు రావడానికి ముందే దీన్ని కార్యరూపంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు