శరవేగంగా సమీకరణాలు మారుతుండడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జాగ్రత్త పడుతున్నారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. ఇందుల్లో భాగంగా 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ వర్గీయలు బస్సుల్లో రహస్య ప్రాంతానికి తరలించారు. వీరందరినీ ఓ హోటల్ కు తరలించినట్టు సమాచారం.