ప్రకాశం జిల్లాలో అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం మెరుపు దాడి చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఒంగోలు ఆర్టీవో రాంప్రసాద్ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో ఏసీబీ దాడులకు దిగింది. ఒంగోలులోని ఆయన నివాసంతో పాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.