ఉపరాష్ట్రపతి పోలింగ్‌: మధ్యాహ్నానికే 90 శాతం | 90.83 per cent voting till 1 pm in vice presidential elections | Sakshi
Sakshi News home page

Aug 5 2017 3:30 PM | Updated on Mar 20 2024 5:06 PM

ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రయలో భాగంగా శనివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు సభ్యులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికే 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంట వరకు 90.83 శాతం ఓటింగ్‌ నమోదయిందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(అసిస్టెంట్‌) ముకుల్‌ పాండే మీడియాకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ఓటు వేయగా, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సభ్యులు ఆయన తర్వాత వరుస కట్టారు. అటుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ వీపీ రాహుల్‌ గాంధీ, ఇతర ముఖ్యులూ పార్లమెంట్‌ హాలుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం ఓటర్ల సంఖ్య 790.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement