సభలో తనపట్ల అనుచితంగా వ్యవహరించిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెన్షన్ వేటు వేశారు. వారిని ఐదురోజుల పాటు సభ నుంచి బహిష్కరించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం లోక్‌సభలో దుమారం రేపారు. వెల్‌లోకి దూసుకొచ్చిన ఆ పార్టీ సభ్యులు మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.