ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. విశాఖపట్నం జిల్లా లంబసింగిలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. పాడేరుఘాట్‌లోని అతిశీతల ప్రాంతమైన పోతురాజుస్వామి గుడి వద్ద 3డిగ్రీలు, పర్యాటక ప్రాంతం లంబసింగిలో 5డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 6 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యమంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి.
Dec 1 2014 11:05 AM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement