కబాలి చిత్రం వెబ్‌సైట్లను చావుదెబ్బ తీసిందా? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా చిత్రపరిశ్రమను ఒక పక్క పైరసీ, మరో పక్క అనధికార ఆన్‌లైన్ సినీ ప్రచారాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను కబాలి చిత్రాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆమ్ని బస్సుల్లోను ప్రసారం చేయకుండా నిరోధించాలని, అలాంటి వెబ్‌సైట్‌లపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.