తన నియోజకవర్గంలో టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పార్టీలో విభేదాలు సర్వసాధారణమని, చిన్న సమస్యలు ఏవైనా ఉంటే త్వరలో సర్దుకుంటాయని చెప్పారు. ఇకపై సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. తన అల్లుడు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తు పార్టీ నిర్ణయిస్తుందన్నారు. లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకుంటారా, లేదా అనేది సీఎం చంద్రబాబు ఇష్టమని అన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
Feb 7 2017 4:21 PM | Updated on Mar 20 2024 3:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement