త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను తమ బుట్టలో వేసుకునేందుకు వీలైన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాలకు కూడా దిగుతున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కుతుందన్న ఎగ్జిట్ పోల్స్ మహత్యమో లేక ప్రధాని మోదీకి ధీటుగా తామెం ప్రచారంలో తక్కువకాదని నిరూపించుకునో ప్రయత్నమో మొత్తానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ బాహుబలి అవతారం ఎత్తారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాహుబలి ఎంతటి క్రేజ్ సంపాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.