మైక్రో ఏటీఎంలు అంటే ఏంటి? | what are micro atms, and how they work | Sakshi
Sakshi News home page

Nov 15 2016 7:13 AM | Updated on Mar 21 2024 6:13 PM

త్వరలోనే భారీ సంఖ్యలో మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడతామని, దానివల్ల డబ్బులు తీసుకోవడం సులభం అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అసలు ఈ మైక్రో ఏటీఎంలు అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇన్నాళ్ల బట్టి డబ్బులు తీసుకోవాలంటే మనకు ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు) మాత్రమే అలవాటు. నిజానికి మైక్రో ఏటీఎం అంటే.. కార్డు స్వైప్ చేసే పోర్టబుల్ యంత్రాలు. వీటికి జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి.. డెబిట్ కార్డు స్వైప్ చేయగానే సంబంధిత బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు పరిమితిని బట్టి ఎంత మొత్తం విత్‌డ్రా చేయాలో అందులో ఎంటర్ చేసిన తర్వాత, అకౌంటు లోంచి ఆ మొత్తం తగ్గుతుంది. అప్పుడు ఆ పోర్టబుల్ యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి.. ఆ మొత్తాన్ని తీసి ఇస్తాడన్న మాట. సాధారణంగా ఈ యంత్రాలను బిజినెస్ కరస్పాండెంట్లు (గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు ప్రతినిధులు) తీసుకెళ్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement