మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ భారత్‌లో పరిశోధన అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రంతో పాటు ఏడాదిలో డిజైన్ హౌస్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇందుకు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, నోయిడా నగరాలను కంపెనీ పరిశీలిస్తోంది. అన్ని సెల్‌ఫోన్లను పూర్తిగా దేశీయంగా తయారు చేయాలన్నది సెల్‌కాన్ ఆలోచన. పీసీబీ, చిప్‌సెట్ తదితర విడిభాగాల తయారీదారుల్ని ఆర్ అండ్ డీలో భాగస్వాముల్ని చేయటంతో పాటు వారితో కలసి డిజైన్ హౌస్‌లో మోడళ్లకు రూపకల్పన చేస్తారు.