పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్‌డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.30గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7గంటల వరకు క్యాంపు ఆఫీస్‌లో ప్రజలతో మమేకమవుతారు.
● 24వ తేదీ బుధవారం ఉదయం 9.00గంటలకు పులి వెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన వేము ల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరుతారు. 10 గంటలకు ఆలయానికి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందుల భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్‌కు బయలుదేరుతారు. మధ్యా హ్నం 1గంట నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
● 25వ తేదీ ఉదయం 8.10గంటలకు బెంగళూరుకు తిరుగుపయనమవుతారు.
మూడు రోజులపాటు పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
24న భూమయ్యగారిపల్లె
గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి
విగ్రహ ప్రతిష్టకు హాజరు


