కళాశాల విద్య ఆర్‌జేడీ మధుసూదన్ శర్మ
కడప ఎడ్యుకేషన్: విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెండంతోపాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్‌జేడీ) డాక్టర్. మధుసూధన్ శర్మ సూచించారు. సోమవారం కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో కడప, అన్నమయ్య జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు గత సంవత్సరం కంటే మెరుగయ్యేటట్లు చూడాలని సూచించారు. అలాగే కళాశాలలోని ఆర్థిక కార్యకలాపాలు క్రమశిక్షణతో కొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కడప జిల్లా ఉమ్మడి నోడల్ రీసోర్సు సెంటర్ అధ్యక్షులు డా. ఎం రవి కుమార్, సభ్యులు డా. సలీంబాషా, పలు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.


