చింతకొమ్మదిన్నె : సోమవారం బుగ్గలపల్లిలో ప్రతాపరెడ్డికి చెందిన నిర్మాణములో ఉన్న కోళ్ల ఫారంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించినది. ఈ ప్రమాదంలో కోళ్లఫారం షెడ్ లోని కూలింగ్ ప్యాడ్స్, ఫీడర్స్, విద్యుత్ పరికరాలు కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ప్రమాదంలో సుమారు 20 లక్షల నష్టం జరిగిందని బాధితుడు వాపోతున్నాడు.ప్రమాదం విషయం తెలుసుకున అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో వచ్చి మంటలను ఆర్పివేశారు.
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
దువ్వూరు : దువ్వూరు మండలం కడప – కర్నూలు జాతీయ రహదారిపై పెద్దజొన్నవరం మెట్ట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొనికి వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పెద్ద జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన రేకులకుంట పెద్ద సుబ్బరాయుడు (50) కూలి పనికి వెళ్లి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి కడపకు వెళుతున్న టాటా నెక్సాన్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెద్ద సుబ్బరాయుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. అతనికి భార్య జయలక్ష్మి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు.


