రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని యువగళం పాదయాత్రలో లోకేష్ గారు మొదట రూ.18 లక్షల పరిహారం, ఆ తర్వాత ఎకరాకు రూ.24 లక్షల రూపాయలు ఇప్పిస్తామని నమ్మబలికారు. గతంలోనే అవార్డు కూడా పాస్ చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం సభలో అవార్డు కాలేదని అబద్ధాలు చెబుతోంది. రైతులు అత్యవసరాలకు తమ భూములను అమ్ముకుందామన్నా సబ్–రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అధికారులు మా చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. మా సమస్యకు పరిష్కారం ఎక్కడా కనిపించడం లేదు.
– సుదర్శన్‌రెడ్డి, బాధిత రైతు, నెమళ్లదిన్నె


