● జిల్లాలోని 115 ఆదర్శ ప్రాథమిక
పాఠశాలల్లో తగ్గిపోయిన హాజరు
● 60 మంది లోపు విద్యార్థులతో
వెలవెలబోతున్న సర్కారు బడులు
● ఒంటిమిట్టలో
అత్యంత దారుణం.. విద్యాశాఖ నివేదికలో షాకింగ్ నిజాలు!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ప్రైవేట్ బడులకు దీటుగా వసతులు కల్పించి, విద్యార్థుల నమోదును పెంచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 397 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఉండగా, అందులో దాదాపు మూడో వంతు అంటే 115 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 లోపునకే పడిపోయినట్లు విద్యాశాఖ అధికారులు జరిపిన తాజా సర్వేలో గుర్తించారు.ఒంటిమిట్టలో అత్యంత దారుణం!జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో ఉన్న ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 20 మంది లోపునకే పరిమితమై మూతపడే స్థితికి చేరుకుంది.
మండలాల వారీగా కుంచించు కుపోయిన విద్యార్థుల వివరాలు
21 నుండి 30 మంది లోపు:
బి.మఠం, గోపవరం, కలసపాడు, కమలాపురం, ఖాజీపేట, మైదుకూరు, పెద్దముడియం, ఒంటిమిట్ట మండలాల పరిధిలోని ఆదర్శ పాఠశాలలు.
31 నుండి 40 మంది లోపు:
బి.కోడూరు, బద్వేల్, చాపాడు, కడప, జమ్మలమడుగు, కమలాపురం, ఖాజీపేట, కొండాపురం, లింగాల, ముద్దనూరు, పెండ్లిమర్రి, ప్రొద్దుటూరు, కాశినాయన, సిద్ధవటం మండలాలు.
41 నుంచి 50 మంది లోపు
(అత్యధిక మండలాలు):
ఆట్లూరు, బద్వేల్, సికెదిన్నె, చాపాడు, చెన్నూరు, కడప, దువ్వూరు, గోపవరం, జమ్మలమడుగు, కలసపాడు, కమలాపురం, ఖాజీపేట, కొండాపురం, లింగాల, మైదుకూరు, ముద్దనూరు, పెద్దముడియం, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, సిద్ధవటం, సింహాద్రిపురం, సుండుపల్లి, వీఎన్‌పల్లి, వల్లూరు, వీరబల్లి, వేముల, ఒంటిమిట్ట, ఎర్రగుంట్ల మండలాలు.
51 నుంచి 59 మంది లోపు:
ఆట్లూరు, బద్వేల్, సికెది న్నె, చక్రాయపేట, చాపాడు, కడప, దువ్వూరు, జమ్మ లమడుగు, కొండాపురం, మైదుకూరు, నందలూరు, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, రాజుపాలెం, తొండూరు, వల్లూరు, వీరబల్లి, ఒంటిమిట్ట, ఎర్రగుంట్ల మండలాల్లోని పాఠశాలలు ఉన్నాయి.


