కడప అగ్రికల్చర్: ఎరువుల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ సూచించారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వానపాముల ఎరువు తయారీపై రైతులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం నిర్వహించిన ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సేంద్రియ ఎరువులలో ముఖ్యమైన ఎరువు వర్మీ కంపోస్ట్ అని తెలిపారు. సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ సాయి మహేశ్వరి, డాక్టర్ ఎస్ మానస , శాస్త్రవేత్తలు డా. టి. మహేష్ బాబు, డా. ఎస్ ప్రశాంతి రైతులు పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: జులై 1వ తేదీ నుంచి వ్యవసా య ఉత్పత్తుల రవాణాకు ముందు తప్పని సరిగా లైసెన్సుదారులైన వ్యాపారస్తులు ఈ ట్రాన్సుపోర్టు పర్మిట్ పొందాలని కడప మార్కెట్‌యార్డు సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. శనివారం కడప మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని లైసెన్సుదారులైన వ్యాపారస్తులు, చెక్‌పోస్టు సిబ్బందితోపాటు అకౌంటెంట్లకు ఈ ట్రాన్స్‌పోర్టు పర్మిట్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సహాయ కార్యదర్శి సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: సుప్రీంకోర్టు ఆదేశాలను కారణంగా చూపి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించాలను కోవడం తగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ అన్నారు. విద్యా శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యాహక్కు చట్టం 23(1) సవరణకు కృషి చేయాలని కోరారు. కడపకు విచ్చేసిన సందర్భంగా ఆయన శనవారం కడప ఓంశాంతి నగర్‌లో గల హోం స్టే లో ఆ సంఘ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లా డారు. చట్ట సవరణ జరిగే వరకూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ పరీక్షను, ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయు ల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకపోతే పోరాటానికి సన్నద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్ పాల్గొన్నారు.


