ఫారం నింపండి..సర్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఫారం నింపండి..సర్‌ !

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

● సెల్ఫ్‌ మ్యాపింగా?.. ప్రోజెనినా?

ఈ దరఖాస్తులో ఉన్న సాంకేతిక కొర్రీలు ఓటర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకవేళ ఓటరు పుట్టిన తేదీ మే 2002కు ముందైతే.. ఫారంలో ఎడమ చేతివైపు ఉన్న బాక్సులో ఓటరు నంబరు ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. అదే కుటుంబ సభ్యులతో మ్యాప్‌ చేసి ఉంటే కుడి చేతి వైపు ఉన్న బాక్సులో వివరాలు నింపాలి. అంటే అవసరానికి అనుగుణంగా ఏదో ఒక బాక్సు మాత్రమే ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కనీస విషయాలు ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు సెల్ఫ్‌ మ్యాపింగ్‌, యాడ్‌ ప్రోజెని, సెల్ఫ్‌ ప్రోజెనిలలో ఏది చేయించుకోవాలో ఓటరే స్వయంగా తె లుసుకుని బీఎల్‌ఓకు చెప్పాల్సి వస్తోంది. ఇందుకోసం ఓటరు 2002 నాటి పాత ఎస్‌ఐఆర్‌ జాబితాను పరిశీలించి, తాను ఏ మ్యాపింగ్‌కు చెందుతానో నిర్ధారించుకోవాల్సి రావడం సామాన్యులకు నరకంగా మారింది. ఆధార్‌, ఓ టరు ఐడీలను మాత్రమే ప్రామాణికంగా తీసు కుని ఓటరు జాబితా సవరణ చేపట్టాలని వా మపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులలో ఒక్కటి కూడా అట్టడుగు వర్గాల ప్రజల వద్ద అందుబాటులో లేవని చెబుతున్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రతి ఏటా ఎంతో సజావుగా, ప్రశాంతంగా సాగిపోయే ఓటర్ల సవరణ ప్రక్రియ (స్పెషల్‌ సమ్మరి రివిజన్‌) ఈసారి మాత్రం ఓటర్లకు చుక్కలు చూపిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపుల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం జరుగుతున్న శ్రీస్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌శ్రీ ఇటు ఓటర్లు, అటు బూత్‌ లెవెల్‌ అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారింది. ఎస్‌ఐఆర్‌లోని అనేక కఠినమైన, సంక్లిష్టమైన నిబంధనలే ఇందుకు ప్రధాన కారణం. కాగితాలు నింపడం చేతకాక, ఎన్నికల సంఘం ప్రకటించిన 12 రకాల గుర్తింపు పత్రాలు సమర్పించలేక పేద ప్రజలు సతమతమవుతుండగా, అసలు తమ ఓటు హక్కు జాబితాలో ఉంటుందో లేదోననే కలవరం మొదలైంది.

మసీదుల వద్ద హెల్ప్‌డెస్క్‌లు

ముస్లింల పేర్లు ఒకేలా ఉండటం, 2002 నాటి ఎస్‌ఐఆర్‌ సమయంలో వారు ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉన్నారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారుతోందని అధికారిక సిబ్బంది చెబుతున్నారు. ఇదే తరుణంలో ముస్లింల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తారనే వదంతులు జిల్లాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. దీంతో ముస్లిం వర్గాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ సామాజిక వర్గ స్వచ్ఛంద సేవకులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మసీదుల వద్ద ప్రత్యేకంగా శ్రీహెల్ప్‌డెస్క్‌శ్రీలను ఏర్పాటు చేశారు. తమ వద్ద 2002 నాటి పాత ఎస్‌ఐఆర్‌ జాబితాలను ఉంచుకుని, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బీఎల్‌ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్‌ ఫారాలను వారే స్వయంగా నింపుతూ ఓటర్లకు కొండంత అండగా నిలుస్తున్నారు.

ఈ గందరగోళం వల్ల ఓటర్లు తమ ఓట్లను కాపాడుకోవడానికి స్థానిక సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం కడప తారకరామ నగర్‌కు చెందిన పలువురు మహిళలు గుంపులుగా 18వ డివిజన్‌లోని విశ్వనాథపురం సచివాలయానికి తరలివచ్చారు. ఎన్యుమరేషన్‌ పత్రాలు ఎలా నింపాలో తెలియడం లేదని, తమకు సహాయం చేయాలంటూ అక్కడి సిబ్బందిని కోరుతూ సతమతమవడం కనిపించింది. ఒక్క కడప నగరంలోనే కాకుండా జిల్లాలోని ప్రతి సచివాలయంలోనూ ప్రస్తుతం ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

బీఎల్‌ఓ సస్పెన్షన్‌..

శ్రీహరిరావు వీధి ప్రజల తిప్పలు!

కడప నగరం 30వ డివిజన్‌ 92వ పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన బూత్‌ లెవెల్‌ అధికారి సురేంద్రబాబు ఇటీవల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్‌ అయ్యారు. అయితే, ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎన్నికల అధికారులు మరొక బీఎల్‌ఓను నియమించకపోవడంతో శ్రీహరిరావు వీధికి చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపలేక ఓటర్ల అవస్థలు

ఓట్లు ఉంటాయో.. పోతాయోనని తీవ్ర అయోమయం

గతంలో లేని నిబంధనల కొర్రీలు

సచివాలయాల చుట్టూ జనం పరుగుల

మసీదుల వద్ద ముస్లింల హెల్ప్‌డెస్క్‌లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement