కడప ర్యాలీకి వెళ్లి వచ్చి వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

కడప ర్యాలీకి వెళ్లి వచ్చి వృద్ధుడు మృతి

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

ఎర్రగుంట్ల : కడపలో జరిగిన కూటమి విజయోత్సవ ర్యాలీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి కుప్పకూలిపోయి సన్నపురెడ్డి జయరామిరెడ్డి (82) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది. ఎర్రగుంట్లకు చెందిన సన్నపురెడ్డి జయరామిరెడ్డి ఐసీఎల్‌ ప్యాక్టరీలో పంపు అపరేటర్‌గా రిటైరయ్యాడు. ఇతను కడపలో జరిగిన ర్యాలీకి వెళ్లాడు. ర్యాలీ ముగియగానే ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో ఒక బంకు వద్ద కూర్చొని అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇతను టీడీపీ పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డు కలిగి ఉన్నాడు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement