రాయల్‌గా తొలి విజయం | - | Sakshi
Sakshi News home page

రాయల్‌గా తొలి విజయం

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

కడప సాక్షిప్రతినిధి: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో భాగంగా కడప వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన డబుల్‌ హెడర్‌ తొలి మ్యాచ్‌లో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ తొలి వియం అందుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఈ హై–స్కోరింగ్‌ థ్రిల్లర్‌ మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ దూకుడుగా సమాధానమిచ్చి విజయాన్ని అందుకుంది.

అభిషేక్‌ రెడ్డి సెంచరీ

మొదట బ్యాటింగ్‌ చేసిన కాకినాడ కింగ్స్‌ జట్టుకు ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (60 బంతుల్లో 112 నాటౌట్‌) సునామీ సెంచరీకితోడు, ఆఖర్లో మిట్టా లేఖాజ్‌ రెడ్డి (17 బంతుల్లో 37) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగుల భారీ కొండను బోర్డుపై ఉంచింది.

తేజ, వాసుల వీరవిహారం!

భారీ లక్ష్య చేధనలో రాయలసీమ ఓపెనర్లు ధ్రువ కుమార్‌ రెడ్డి (14), మామిడి వంశీ కృష్ణ (11)లు త్వరగానే అవుట్‌ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సీహెచ్‌ సాయి సందీప్‌ (26) ధాటిగా ఆడాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గరిమెళ్ల తేజ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు సాధించి ఆఖరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. వై.తేజ రెడ్డి (41) ఇతనికి సహకారమందించాడు. లోయర్‌ ఆర్డర్‌లో వచ్చిన యాడ్ల వాసు కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 42 పరుగులు సాధిం రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది.

‘రాయల్‌’ విక్టరీ.. ‘కింగ్స్‌’పై సంచలన విజయం!

గరిమెళ్ల తేజ(76) విధ్వంసం..

యాడ్ల వాసు(42) పరుగుల సునామీ

212 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఊదేసిన రాయల్స్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement