అధునాతన గ్రౌండ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అధునాతన గ్రౌండ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడపలోని వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో ఐదు రోజులు జరిగే ఏపీఎల్‌ క్రికెట్‌ పండుగ బుధవారం ప్రారంభమైంది. కాగా ఈ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే గ్రౌండ్‌ను పలు అభివృద్ధి పనులు చేశారు. దీనికి సంబంధించి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌, సెక్రటరీ సానా సతీష్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. దేశవాళీ మ్యాచ్‌లను సైతం కడప ఆతిథ్యం ఇవ్వాలని అధ్యక్ష కార్యదర్శులు ఆకాంక్షించారు. స్టేడియంను నూతనంగా రెన్యువెట్‌ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తూ మెరుగైన మ్యాచ్‌లు నిర్వహిస్తూ మంచి గ్రౌండ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నా రు. రాబోయే రోజుల్లో మరింతగా సౌకర్యాలు పెంచి మరిన్ని మ్యాచులు కడప స్టేడియంలో జరిగే విధంగా చూస్తామని భరత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ శ్రీనివాస్‌, సి ఓ ఓ గిరీష్‌ డోంగ్రి , సీఏఓ జై కిషన్‌, ఏసీ ఏ గేమ్‌ డెవలప్మెంట్‌ మేనేజర్‌ ఎమ్మెస్‌ కుమార్‌, కడప క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ముని కుమార్‌ రెడ్డి, సెక్రటరీ రెడ్డి ప్రసాద్‌, స్టేడియం కమిటీ చైర్మన్‌ శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి, కన్వీనర్‌ సంజయ్‌ కుమార్‌ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సునీత ప్రదర్శన

ఏపీఎల్‌ మ్యాచ్‌ ప్రారంభం సందర్భంగా సినీ నేపధ్య గాయనీ సునీత తన గానమాధుర్యంతో అందరినీ అలరించా రు. సినిమాల్లో ఆలపించిన గీతాలతోపాటు ఇతర పాటలను పాడి అందరిలోనూ ఉత్తేజాన్ని నింపారు.

ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌, సెక్రటరీ సానా సతీష్‌

అభివృద్ధి పనులు వర్చువల్‌గా ప్రారంభం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement