ఏపీఎల్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఏపీఎల్‌కు సర్వం సిద్ధం

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడపలో తొలిసారిగా నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–5 మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏసీఏ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యుడు భరత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నగర శివార్లలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయన్నారు. రిమ్స్‌ సమీపంలోని వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్‌ మ్యాచ్‌లను జిల్లా ప్రజలు వీక్షించి ప్రోత్సహించాలన్నారు. ఈ మ్యాచ్‌ల్లో కడపకు చెందిన 9 మంది క్రీడాకారులు ఆడనున్నట్లు వివరించారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించవచ్చని తెలిపారు. బీసీసీఐ మెంబర్‌ చాముండేశ్వరినాథ్‌తో పాటు ఏసీఏ నుంచి పలువురు పెద్దలు హాజరు కానున్నారన్నారు. ఆంధ్రక్రికెట్‌ అసోసియేషన్‌ సీఈఓ గిరీష్‌ గోగ్రే, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టేడ్‌, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి రెడ్డిప్రసాద్‌, అధ్యక్షుడు మునికుమార్‌రెడ్డి, స్టేడియం కమిటీ మెంబర్‌ సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement