కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బందికి సోమవారం ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ల పదోన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కడపలోని ఇంటర్ విద్య ఆర్‌జేడీ కార్యాలయంలో సోమవారం ఈ పదోన్నతి కార్యక్రమాన్ని ఆర్‌జేడీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బంది అయిన పార్వతి, దీప్తి, శిరీష, అపర్ణ,, అశ్విని, భాస్కర్, కిషోర్, శివకుమార్ తదితరులకు ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వారిని చిత్తూరు నాన్ టీచింగ్ స్టాప్ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి, కళాశాల విద్య ఆర్‌జేడీ సురేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.


