కడప, రాజంపేటలో రైల్వే జీఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

కడప, రాజంపేటలో రైల్వే జీఎం పర్యటన

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

రాజంపేట/కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప, రాజంపేట రైల్వేస్టేషన్‌లలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథూర్‌ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వేస్టేషన్లలోని పలు విభాగాలను పరిశీలించారు. అమృత్‌ భారత్‌ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వీటిని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు రాజంపేటలో గుంతకల్‌ డీఆర్‌యూసీ సభ్యుడు తల్లం భరత్‌కుమార్‌రెడ్డి.. రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి వివిధ రైల్వే సమస్యలపై రూపొందించిన లేఖలను అందజేశారు. జీఎం సానుకూలంగా స్పందించారు. జీఎంను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడగలం శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ నాయకుడు ధారా వెంకటరమణ తదితరులు ఉన్నారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ యెద్దల విజయసాగర్‌ తదితరులు తమ ప్రాంత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కడపలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కడప డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రశేఖర్‌ గుప్తా, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ వినీత్‌కుమార్‌, ఇతర అధికారులు సురేష్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, శ్రావణ్‌కుమార్‌, మనోజ్‌, సుదర్శన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, కోటేశ్వరరావు, మోహన్‌రెడ్డి, జనార్దన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement