ఇకపై ఇలా... | - | Sakshi
Sakshi News home page

ఇకపై ఇలా...

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

ఇకపై ఇలా...

ముగిసిన వేసవి సెలవులు

తల్లిదండ్రులపై గురుతర బాధ్యత

కడప ఎడ్యుకేషన్‌: వేసవి సెలవులు ముగిశాయి. ఇన్నాళ్లు ఇళ్లల్లో అల్లరి చేసిన చిన్నారులు ఇక బడిబాట పట్టనున్నారు. మూలన పడేసిన స్కూల్‌ బ్యాగులు దుమ్ముదులిపి సర్దుకొని భుజాన తగిలించనున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా వారిని బడికి పంపేందుకు సన్నద్ధమవుతూ వారికి కావాల్సిన విద్యా సామగ్రిని సిద్ధం చేసి వారిని బడికి పంపే పనిలో పడ్డారు. ఒకటా రెండా 50 రోజుల పాటు అల్లరి చేసిన పిల్లలు ఒక్కసారిగా బడిబాట పట్టాలంటే కాసింత భారంగా ఉంటుంది. భారమైన బడివైపు అడుగులు వేయాల్సిందే. వారిని సిద్ధం చేయాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులదే.

వారం ముందు నుంచే ప్రణాళికతో...

తల్లిదండ్రులు వారం ముందు నుంచే తమ పిల్లల చదువులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు, ఇతర వస్తువులు సమకూర్చుకున్నారు. దీంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో ముందుగా ఫీజులు చెల్లించడం, పుస్తకాలు, ఇతర సామగ్రి కోసం డబ్బులను కట్టి విద్యాసామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు.

ఠారెత్తించిన ఎండలతో...

దుమ్మురేగిన ఆటలతో కుస్తీ ముగిసింది..

బళ్లో పాఠాలతో..

పుస్తకాల బ్యాగులతో దోస్తీ కట్టే వేళయింది..

అమ్మమ్మ ఊరిలో చేసిన సందడికి..

అయ్య కారులో తిరుగుతూ చేసిన అల్లరికి

బైబై చెప్పే సమయం ఆసన్నమైంది..

అదిగో.. గణగణమంటూ

బడిగంట శబ్దం మోగింది...

ఇదిగో.. సావాసగాడితో

జతకట్టి వెళ్లే క్షణం రానే వచ్చింది...

సుమారు యాభై రోజుల వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. రా రమ్మంటూ పిల్లలను

ఆహ్వానిస్తున్నాయి..

బడికెళ్లేటప్పుడు ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేసేవారో ఇప్పుడు అదే సమయానికి పిల్లలను మేల్కొనేలా చూడాలి.

సెల్‌ఫోన్లు చూడటం మాన్పించాలి. ఇప్పటి వరకు రోజుకు రెండు మూడు గంటల చూస్తే వచ్చే వారం పదిరోజులు రోజుకు అరగంట మించకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. కథల పుస్తకాలు, జీవిత చరిత్ర, వ్యక్తిత్వ వికాస, తరగతి పుస్తకాలు రోజుకు కనీసం అయిదారు పేజీలైనా చదివేలా చూడాలి

బడికెళ్లేటప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యలో స్నాక్స్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర వేళకు భోజనం క్రమశిక్షణగా చేసినట్టే ఇప్పుడూ అలవాటు చేయాలి. చిరుతిళ్లను మాన్పించాలి. పాఠశాలల్లో భోజన సమయాలను తెలుసుకుని ఇప్పటినుంచే

ఆ విధంగా అందించాలి

1361

బేసిక్‌

ఫౌండేషన్‌ స్కూల్స్‌

207

జిల్లాలో

ఫౌండేషన్‌ స్కూల్స్‌

35

అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌

397

మండల పరిషత్తు స్కూల్స్‌

307

హైస్కూల్స్‌(ఇంక్లూడింగ్‌ బీపీఎస్‌ +ఎంిపీఎస్‌)

886

ప్రైవేటు

స్కూల్స్‌

64

ఎయిడెడ్‌

స్కూల్స్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement