కర్నూలు, చిత్తూరు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

కర్నూలు, చిత్తూరు జట్ల విజయం

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–23 అంతర్‌ జిల్లాల వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. బుధవారం కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి సూర్యతేజ రెడ్డి 70 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 110 పరుగులు చేశారు. మనోజ్‌రాజ్‌ 41 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్‌ 3, ప్రమోద్‌కుమార్‌ 2, మల్లికార్జున 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 49.2 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని అర్జున్‌ టెండూల్కర్‌ 67, విశ్వ వికాస్‌ 80 పరుగులు చేశారు, కర్నూలు జట్టులోని సాబ్‌జాన్‌బాషా 3, దినేష్‌కుమార్‌ 3 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 11 పరుగులు తేడాతో విజయం సాధించింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి, టాస్‌గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 45.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని షేక్‌ కమాల్‌ 48, తోషిత్‌ యాదవ్‌ 47 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని రెడ్డి ప్రకాశ్‌ 4, సాయి చరణ్‌ 2, నవీన్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.జట్టులోని తేజరెడ్డి 63, గౌతమ్‌ కృష్ణ తేజ్‌ 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్‌ మహేష్‌ 3 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement