పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

చెన్నూరు (వల్లూరు)/మైదుకూరు : చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డబ్బు కోసం కన్న బిడ్డను అమ్ముకున్న విషయంపై పోలీసులు, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం ముమ్మురంగా విచారణ చేపట్టారు. ఐిసీడీఎస్‌ ఆధ్వర్యంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అడ్వైజర్‌ సునీత సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో అక్కడి సిబ్బందితో విచారించారు. ఆసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు ఏ తేదీల్లో నిర్వహించారనే విషయాలపై విచారణ చేశారు. అలాగే కన్నబిడ్డ దూరం కావడంతో తల్లడిల్లిన తల్లి లక్ష్మి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేసే సుబ్బమ్మ అనే మహిళ వద్ద పసిబిడ్డ ఉండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని చెన్నూరు పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న సుబ్రమణ్యంను పోలీసులు విచారించగా తనకు చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే స్టాఫ్‌ నర్స్‌ కవిత ఇచ్చినట్లు పోలీసులకు తెలియజేశారు.సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే స్టాఫ్‌ నర్స్‌ కవిత, సెక్యూరిటీ గార్డ్‌ భైరవ, స్వీపర్‌ పుష్ప, బాల కుమార్‌, పేర్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా దొరికిన పసికందును తల్లి లక్ష్మీనారాయణమ్మకు అప్పగించి తల్లీబిడ్డను వన్‌ స్టాప్‌ సెంటర్‌కు తరలించారు., దీనిపై పూర్తి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ శంకర్‌ నాయక్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీరాములు, శ్రీకాంత్‌, ఐసిడిఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement