ముత్తూట్‌లో గోల్డ్‌ మాయం చేశారు | - | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌లో గోల్డ్‌ మాయం చేశారు

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

ముత్తూట్‌లో గోల్డ్‌ మాయం చేశారు

అనుమానంతో బ్యాంకుకు

పరుగులు తీసిన ఖాతాదారులు

బ్యాంకును తెరవనీయకుండా అడ్డగింత

రాయచోటి: రాయచోటిలోని ముత్తూట్‌ ఫైనా న్స్‌ బ్యాంకు మేనేజర్‌ ఖాతాదారుల బంగారు నగలతో వెళ్లిపోయారన్న ప్రచారం బంగారు పె ట్టిన ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా యి. ఖాతాదారులు బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. మేనేజర్‌ వచ్చేవరకు బ్యాంకు తాళాలను తెరవడానికి వీ లులేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయా న్ని తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖాతాదారులకు సర్దిచెప్పి అనుమానాలు ఉంటే బ్యాంకు తెరిచిన తరువాత నివృత్తి చేసుకోవాలని, నగలు చూపించకపోతే అనంతరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఖాతాదారులు బ్యాంకును ఓపెన్‌ చేయడానికి సమ్మతించారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఖాతాల్లో సిబ్బంది చేతివాటం లేదా భారీ దోపిడీల వల్ల కస్టమర్ల బంగారం అపహరణకు గురైన సంఘటనలు ఖాతాదారుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంబేపల్లి మండలం, గున్నికుంట్ల గ్రామం, కత్తివాండ్లపల్లికి చెందిన ఉమా మహేశ్వర్‌ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పెట్టి రూ. 11.36 లక్షల మొత్తం రుణంగా పొందారు. రెన్యువల్‌ నిమిత్తం బ్యాంకు మేనేజర్‌కు 073170 నంబరు ఉన్న ఖాళీ చెక్కును అందజేశానన్నారు. ఈ చెక్కుతో గోల్డ్‌లోన్‌కు జమ చేయకుండా మేనేజర్‌ పసుపులేటి నరేష్‌ తన భార్య చిన్నమనేని లక్ష్మీదేవి పేరున రూ. 9,50,000లు డ్రా చేసినట్లు బ్యాంకు ఎదుట మీడియాకు వివరించారు. రెండు రోజులుగా బ్యాంకుకు రాకుండా ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై రాయచోటి అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారన్నారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై బ్యాంక్‌ మేనేజర్‌ నరేష్‌ను ఫోన్‌ ద్వారా వివరణ కోరగా ఉమా మహేశ్వర్‌ రెడ్డి తన దగ్గర వ్యక్తిగతంగా రూ. 6 లక్షల వరకు అప్పుగా తీసుకున్నారన్నారు. ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ మొత్తం కలిపి చెక్కు ద్వారా మాకు జమ చేశారని తెలిపారు. బ్యాంకులో గోల్డ్‌ ద్వారా రుణం పొందిన డబ్బులకు, నాకు చెల్లించిన డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రెండు రోజులుగా తాను వ్యక్తిగత కారణాలు వల్ల సెలవుల్లో ఉన్నానని తెలిపారు. ఈ సమయంలో ఉమా మహేశ్వర్‌ బుధవారం కొంతమందితో బ్యాంకు దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇదే విషయం ఖాతాదారుల్లో గందరగోళాన్ని నెలకొల్పిన సంఘటనపై రాయచోటి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

ముత్తూట్‌, మణప్పురం ఇతర ఫైనాన్స్‌ బ్యాంకుల్లో బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పెట్టిన నగలను తిరిగి పొందటానికి ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని ప్రైవేట్‌ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ముత్తూట్‌ బ్యాంకులో వచ్చిన ఆరోపణలపై భీతిల్లిన ఖాతాదారులు బుధవారం ఒక్కరోజు రూ. 40 లక్షలు చెల్లించి బంగారాన్ని పొందినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement