ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

ముద్దనూరు: ముద్దనూరు–పులివెందుల ప్రధాన రహదారిలో ఈనెల 29న బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌(25) అనే యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.ఏఎస్‌ఐ రమేష్‌ కథనం మేరకు మండలంలోని ఆరవేటిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ తలుపుల మండలం వేమలగండిలో ఉన్న తన భార్య దగ్గరికి ఆదివారం రాత్రి బైక్‌పై బయలుదేరాడు.మండలంలోని నల్లబల్లె గ్రామ సమీపంలో కుక్క అడ్డురావడంతో బైక్‌ను అదుపుచేసుకోలేక కిందపడిపోయాడు.ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి.వెంటనే అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడనుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు.మృతుని భార్య నాగజ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement