నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Jan 13 2026 6:03 AM | Updated on Jan 13 2026 6:03 AM

నకిలీ

నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు

అక్రమార్కుల నుంచి మా భూములు కాపాడండి

రాయచోటి : నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ముఠాను రాయచోటి రూరల్‌ పరిధిలోని చిన్నమండెం పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎస్‌కె రోషన్‌ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి రెండు కిలోల నకిలీ బంగారం, రూ. 3 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రాయచోటి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్‌తో కలిసి సిఐ మీడియాకు వివరించారు.

తమిళనాడు రాష్ట్రం, తంజావూరుకు చెందిన బంగారు వ్యాపారులకు రెండు కిలీల నకిలీ బంగారాన్ని విక్రయించి మోసం చేశారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ బంగారం విక్రయిస్తున్న వారిపై చిన్నమండెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందన్నారు. సమాచారం మేరకు చిన్నమండెం సమీపంలోని కేశాపురం చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో కారుతోపాటు శాంపిల్‌గా ఉన్న 170 మిల్లీ గ్రాముల బంగారం, నగదును స్వాధీనం చేసుక్నునామన్నారు. వీరబల్లి మండలం, షికారుపాలెంకు చెందిన నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి నకిలీ బంగారు విక్రయంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌ల ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వివరించారు.

లక్కిరెడ్డిపల్లి : అక్రమార్కులు మా తెలియకుండానే మా భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని బాధిత రైతులు వాపోయారు. తమ భూములను కాపాడాలని మండలంలోని గద్దగుండ్లరాచపల్లికి చెందిన బాధిత రైతులు కొండూరు రఘునాథరాజు, ఎనపడ్డ వెంకటసుబ్బన్న, వెంకటరామరాజు, షేక్‌ జబ్బర్‌ సాహెబ్‌, షేక్‌ దర్బార్‌ భాష, షేక్‌ తాజ్‌ భాష, షేక్‌ ఉమర్‌ భాషలు సోమవారం తహసీల్దార్‌ క్రాంతి కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గద్దగుండ్ల రాచపల్లి పొలంలో సర్వే నెంబరు. 625లో 7.18 ఎకరాలతో పాటు సర్వే నెంబరులోని 626లో 6.24 ఎకరాలు, సర్వే నెంబరు 614లో 19.68 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్నారన్నారు. వారి నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం వారు ఎస్‌ఐ డి శోభ, సీఐలకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

రెండు కిలోల నకిలీ బంగారు స్వాధీనం

రూ.3 లక్షల నగదు, కారు స్వాధీనం

నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు
1
1/1

నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement