ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్య సంరక్షణ
కడప ఎడ్యుకేషన్ : ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని, అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్ విభాగ ప్రతినిధి శ్రీనాథ్ తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన వివిధ రకాల పంటలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రతి సోమవారం జిల్లా కేంద్రమైన కడప జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న వీక్లీ ఫుడ్ బాస్కెట్ స్టాల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ స్టాల్స్‌లో కూరగాయలు, పప్పుదినుసులు, ధాన్యాలు తదితర ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా పండించినట్లు తెలిపారు. వీటిలో సహజ పోషక విలువలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఇలాంటి ఆహారాన్ని నిరంతరం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించడమే కాకుండా, జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సిబ్బంది చురుకుగా పాల్గొని, ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యత, ఉత్పత్తుల నాణ్యత, సాగు విధానాలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. అలాగే, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయని వివరించారు.
రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో
వీక్లీ ఫుడ్ బాస్కెట్ స్టాల్స్


