
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ముద్దనూరు, లింగాల, పులివెందుల మినహా మిగతా 33 మండలాల్లో వర్షం కురిసింది. ఈ వాన చిరుపొట్ట దశలో ఉన్న వరికి కొంత నష్టం కలిగించే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ, పెన్నానది, నీటి వసతి ఉన్న బోర్ల కింద ముందస్తుగా సాగు చేసుకున్న వారికి.. వరుసగా కురుస్తున్న వర్షాలతో గుండె గుబేల్‌మంటోంది. ఎందుకంటే వర్షపు నీరు చిరుపొట్టలోకి చేరితే వరి ఎన్ను తాళ పోయే అవకాశం ఉంది. వెన్ను బయటికి వచ్చిన వరికై తే కంకికి ఉన్న సుంకు రాలిపోయే ప్రమాదం ఉంది. పత్తి, వేరుశనగ రైతులు కూడా కలవర పడుతున్నారు. ఈ వర్షపు నీరు పత్తికాయల్లోకి వెళ్లితే పత్తి కుళ్లిపోయే అవకాశం ఉంది. వేరుశనగ పంటలో నీరు నిలిస్తే ఊడలు ఎర్రగా మారి, భూమిలోకి సరిగా దిగవని రైతులు పేర్కొంటున్నారు. శనగ పంట సాగు చేసుకునే రైతులకు మాత్రం ప్రస్తుతం వర్షం చాలా అవసరం. ఉద్యానపంటలైన మామిడి, సపోట, చీని, డ్రాగెన్ ప్రూట్ వంటి రైతులకు కూడా మేలే.
మండలం కురిసిన వర్షం(మి.మీ )
మూడు మండలాలు మినహాజిల్లా అంతటా వాన
అత్యధికంగా అట్లూరులో 69.4 మి.మీ
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
అట్లూరు 69.4
కడప 36.8
ఒంటిమిట్ట 33.6
సిద్దవటం 30.2
గోపవరం 29.2
బద్వేలు 23.4
సీకే దిన్నె 20.4
వేంపల్లి 20.0
పెండ్లిమర్రి 19.2
పోరుమామిళ్ల 16.2
బి.మఠం 15.6
మైలవరం 14.6
దువ్వూరు 14.6
బి.కోడూరు 14.2
వీఎన్‌పల్లి 14.2
చెన్నూరు 14.2
సింహాద్రిపురం 12.4
కలసపాడు 11.0
రాజుపాళెం 10.0
తొండూరు 9.4
ఖాజీపేట 8.2
వేముల 8.0
మైదుకూరు 7.8
వల్లూరు 6.8
జమ్మలమడుగు 6,2
చాపాడు 3.4
కమలాపురం 2.4
కొండాపురం 2.4
చక్రాయపేట 1.8
ప్రొద్దుటూరు 1.2