
నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయించవద్దు
మహిళపై దాడి
మైదుకూరు : పట్టణంలోని అరుంధతీ నగర్‌కు చెందిన మహిళ గద్దె సుజాతపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 11న సుజాత భర్త రవికి, బొచ్చెనపల్లె పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుకు మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ నెల 14న సుజాతపై ముగ్గురు దాడి చేసి గాయపరిచి అవమానపరిచారు. చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చేరిన బాధితురాలు అక్కడ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుపై ఎస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు.
ఉల్లి పంటను దున్నేసిన రైతు
ముద్దనూరు : ప్రభుత్వం నుంచి మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఉల్లి పంటను దున్నేస్తున్నారు. మండలంలోని చింతకుంటకు చెందిన రైతు ఆదినారాయణరెడ్డి ఐదు ఎకరాల్లో తాను సాగు చేసిన ఉల్లి పంటను రోటోవేటర్‌తో ఇలా దున్నేసి మట్టిలో కలిపేశాడు. చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేక, రవాణా వ్యయం భరించలేక దున్నేశానని రైతు తెలిపారు. ఐదు ఎకరాల్లో పంట సాగుకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని, చిల్లిగవ్వ రాక ఆర్థికంగా నష్ట పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సు ఆపలేదని
మహిళల ఆగ్రహం
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని కొత్త బోయనపల్లె (రాజంపేట మండలం) సమీపంలో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట–కడప మధ్య నడిచే పల్లె వెలుగు బస్సును డ్రైవర్ న్యూబోయనపల్లె వద్ద ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. మహిళా ప్రయాణికులు డ్రైవర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఉచిత బస్సు ఓవర్ లోడ్‌తో ఉన్నా ఆపాల్సిందేనని ప్రయాణికులు పట్టుబడుతుండడంతో డ్రైవర్, కండెక్టర్లు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేస్తున్నారు.
ఇద్దరికి జైలుశిక్ష
ములకలచెరువు/తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్.గణేష్ తెలిపిన వివరాల మేరకు.. 2019 డిసెంబర్, 5న ములకలచెరువు పోలీసులకు వచ్చిన సమాచారంతో మదనపల్లె–కదిరి రోడ్డు తంబేపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. మదనపల్లె నుంచి ఓ టాటా సుమో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులలను చూసి ఆగింది. ఆ వాహనంలోని ఇద్దరు కర్ణాటక, కోలార్ జిల్లా బంగారుపేట తాలూకా, దొడ్డూరుకు చెందిన నారాయణప్ప శివకుమార్, బంగారు పేట తాలూకా కురబర హళ్లికి చెందిన సుబ్రహ్మణ్యం, మంజునాథ్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని 162 కిలోల ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ఆర్‌ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి
ఆర్‌ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, అనుమతి లేకుండా మెడికల్ షాపులు, క్లినిక్, ప్రైవేట్ క్లినిక్‌లు, ల్యాబ్‌లు నడిపితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని సీజ్ చేస్తాం. కడప రోడ్డులో ఆర్‌ఎంపీ ముందు వైపు మెడికల్ షాపు నిర్వహిస్తూ లోపల ఆర్‌ఎంపీ క్లినిక్‌ను నడుపుతున్నారు. మందుల కోసం వస్తే లోపల డాక్టర్ ఉన్నాడంటూ పంపుతున్నారు. ఆర్‌ఎంపీలు ఇంజెక్షన్ చేయవద్దని, సైలెన్లతో చికిత్స చేయొద్దని చాలాసార్లు హెచ్చరించాం. ఆస్పత్రి బోర్డులో ఒకరి పేరు కనబరిచి.. మరొకరు వైద్యం చేయాలంటే వైద్య సమయాలను సూచిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిబందనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– భారతి, జిల్లా డెమో అధికారి
కడప అర్బన్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వఉంచినా, విక్రయించినా పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు శుక్రవారం ఆయన దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టపాసుల విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సూచించిన బహిరంగ ప్రదేశాలు, వారికి కేటాయించిన ప్రాంతంలో నిర్ణీత కొలతల మేరకు దుకాణాలు ఏర్పాటుచేసుకుని , లైసెన్సులు కలిగిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయించాలన్నారు. లైసెన్సు పొందిన గోదాములు, దుకాణాలు, తాత్కాలిక దుకాణదారులు తూచాతప్పకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాలకు తావు లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని ఎస్పీ సూచించారు. షాపు, షాపుకు మధ్య నిర్దేశించిన దూరం తప్పనిసరిగా పాటించాలని, ప్రతి దుకాణంలోనూ నీరు, ఇసుక, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను విక్రయాల పనుల్లో ఉంచుకోరాదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీపావళి రోజున జాగ్రత్త..
దీపావళి పర్వదినం జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితంగా పండగ జరుపుకోవాలని కోరారు. కాటన్ దుస్తులు ధరించి చిన్నారుల తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణాసంచా కాల్చాలని సూచించారు. రోడ్డు వెంబడి వెళ్లే వాహనాలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా టపాసులు కాల్చుకోవాలని, బకెట్‌లో నీరు ఉంచుకొని జాగ్రత్త ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, గాయాలైతే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఇంటి లోపల బాణసంచా కాల్చకూడదని, సగం కాలిన వాటిని మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయడం, ముట్టుకోవడం ప్రమాదకరంమని అన్నారు. ఆస్పత్రుల వద్ద బాణాసంచా కాల్చరాదని ఎస్పీ సూచించారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, టపాసులు విక్రయిస్తున్నా సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయించవద్దు

నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయించవద్దు