
సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాలి
మైదుకూరు : విద్యార్థులు సీపీఆర్(కార్డియో పల్మనరి రిసిస్టేషన్)పై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. వనిపెంట జ్యోతిరావు పూలే గురుకులం, మైదుకూరు కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులకు సీపీఆర్‌పై శుక్రవారం అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌ఓ నాగరాజు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్సగా ఉపయోగపడే సీపీఆర్‌పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. సీపీఆర్‌తో వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించవచ్చని పేర్కొన్నారు. పరిశుభ్రతతో వ్యాధులబారిన పడకుండా ఉండవచ్చని, సరైన పద్ధతిలో చేతులు కడుక్కోవడవ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఆడ పిల్లలను రక్షించడం, చదివించడం ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి.మల్లేష్, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డెమో డి.భారతి, మెడికల్ ఆఫీసర్ సుమధుర, జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల, కస్తూర్బా పాఠశాల ఎస్‌ఓ విజయ పాల్గొన్నారు.
చిరుధాన్యాల ఉత్పత్తులతో స్వయం ఉపాధి
కడప అగ్రికల్చర్: చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో నైపుణ్యం పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందవచ్చునని ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్. అంకయ్యకుమార్ పేర్కొన్నారు. ఊటకూరు కేవీకేలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, లేబులింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్‌పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు ధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేయడమేగాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేరుస్తాయని తెలిపారు. ఇటీవల కాలంలో యువత చిరుధాన్యాల ఉత్పత్తి సంస్థలను స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం వారికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. మార్కెట్‌లో ఉత్పత్తులకు గుర్తింపు పొందేలా ఆకర్షణీయమైన లేబుల్స్, సరైన ప్యాకేజింగ్, నాణ్యత ప్రమాణాలు అత్యంత ముఖ్యమని వివరించారు.
చెరువులో పడి ఒకరు మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ మండలం శిబ్యాల పరిధిలోని కానుగ చెరువులో పడి పఠాన్‌మున్నా (40) శుక్రవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. శిబ్యాల గ్రామం (చెరువుకు దగ్గరగా ఉన్న ఊరు)లోని తన ఇంటి నుంచి గేదెలను మేపేందుకు పఠామున్నా వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగించారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించి చెరువులో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. గేదెలు మేస్తూ చెరువులోకి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. లోతైన గుంటలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. రఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేవీకే పోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ అంకయ్యకుమార్
డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు

సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాలి