
యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా
● ప్రతి రోజు వంద టన్నులకుపైగా
ఇసుక తరలింపు
● మండల స్థాయి టీడీపీ నాయకుడి
అండతో రవాణా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : మండలస్థాయి టీడీపీ నేత అండతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చక్రాయపేట మండలం మారెళ్ల మడక సమీపంలో ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రీచ్‌లో భారీగా వర్షపునీరు చేరింది. ఈ పరిణామం చక్రాయపేట మండల టీడీపీ నాయకుడికి వరంగా మారింది. అద్దాలమర్రి చెక్ పోస్టు సమీపంలో అమ్మవారి గుడి వద్ద పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులో ఉండడం గమనించి దానిపై ఆ నాయకుడు కన్నేశారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతంలో హిటాచీ ఏర్పాటుచేసి నిత్యం వంద టన్నులకు పైగా ఇసుక తరలించేస్తున్నారు. నిత్యం ఇది కనిపిస్తున్నా.. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. టన్నుల వారీగా వచ్చే ఆదాయంలో వాటాల రూపంలో అందరికీ చేరుతోందనే ఆరోపణలున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమ్మవారి ఆలయం నిర్మించి అక్కడి వరకూ సీసీ రహదారి నిర్మించింది. ఈ ఆలయ సమీపంలోనే తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా