
విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రతిభా పోటీలు
కడప ఎడ్యుకేషన్ : నేషనల్ సైన్సు సెమినార్ జిల్లా స్థాయి పోటీలలో దువ్వూరు కేజీబీవీకి చెందిన షఫియా, సికె.దిన్నె జెడ్పీ హైస్కూల్‌కు చెందిన జాస్మిన్ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపికయ్యారు. కడపలోని అంధుల ఉన్నత పాఠశాలలో జరిగిన నేషనల్ సైన్సు సెమినార్‌లో డీఈఓ షేక్ షంషుద్దీన్, డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినైజర్ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు క్వాంటమ్ ఏజ్ బిగిన్స్, ఫొటెన్షియల్ అండ్ చాలెంజెస్‌పై చాట్స్, స్లైడ్స్ ద్వారా పోటీలు జరిగాయన్నాఉ. ఎంపికై న విద్యార్థులు రెండు రోజుల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, మురళి, విద్యార్థులు పాల్గొన్నారు.