
ఐదుగురు తహసీల్దార్లకు పదోన్నతి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో పని చేస్తున్న ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా అడ్‌హక్ పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్:383 జారీ చేసింది. కడప తహసీల్దార్ నారాయణరెడ్డి, కమలాపురం తహసీల్దార్ శివరామిరెడ్డి, పోరుమామిళ్ల తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, పెండ్లిమర్రి తహసీల్దార్ అనూరాధ, కలెక్టరేట్ ఎఫ్–సెక్షన్ సూపరింటెండెంట్ మాధవకృష్ణారెడ్డి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన జాబితాలో ఉన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21వ తేదీన తిరుపతి–హైదరాబాదు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07499 నంబరు గల రైలు మంగళవారం తిరుపతిలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదిగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా హైదరాబాదుకు మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నవంబర్ 7న హాకీ ఇండియా 100వ వార్షికోత్సవ వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ సంఘం సెక్రటరీ శేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో కడప హాకీ సంఘం సీనియర్ క్రీడాకారులు, కోచ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో హాకీ ఇండియా అసోసియేషన్ స్థాపించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఏపీ రాష్ట్ర అసోసియేషన్ ఆదేశాలకు జిల్లాలో ఉత్సవాలు జరపాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఆ రోజున పురుషులకు, మహిళలకు హాకీ పోటీలు నిర్వహించి సీనియర్ క్రీడాకారులను, క్రీడాకారిణులను సన్మానిస్తామని పేర్కొన్నారు.

ఐదుగురు తహసీల్దార్లకు పదోన్నతి